![]() |
![]() |
.webp)
విభిన్న జోనర్స్ కి చెందిన చిత్రాలు మార్చినెల మొదటి వారంలో థియేటర్స్ తో పాటు ఓటిటి లోను సందడి చేయనున్నాయి.దీంతో మూవీ లవర్స్ కావాల్సినంత సినీ వినోదాన్ని ఆస్వాదించనున్నారుమరి ఈ లిస్ట్ ఏంటో చూసేద్దాం.
థియేటర్ వేదికగా చూసుకుంటే'ఛత్రపతి శివాజీ మహారాజ్'(Cchathrapati shivaji maharaj)తనయుడు 'ఛత్రపతి శంభాజీ మహారాజ్'(Cchathrapati shambhaji maharaj)జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'చావా'(Chhaava)ఈనెల 7 న తెలుగులో విడుదల కానుంది.గత నెల 14 న హిందీ లాంగ్వేజ్ లో విడుదలైన ఈ మూవీ ఘన విజయాన్ని అందుకోవడంతో తెలుగు వెర్షన్ పై భారీ అంచనాలు ఉన్నాయి.విక్కీకౌశల్,రష్మిక ప్రధాన పాత్రలు పోషించారు.మలయాళంలో ఇటివల రిలీజై హిట్ టాక్ తో దూసుకుపోతున్న 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ ' కూడా ఈ నెల 7 న తెలుగు నాట విడుదల కానుంది.ప్రియమణి, కుంచకో బోబన్, విషాక్ నాయర్ ప్రధాన పాత్రలు పోషించగా, హిట్ చిత్రాల దర్శకుడు జీతూ అష్రాఫ్ తెరకెక్కించడం జరిగింది.ఆమని ప్రధాన పాత్రలో తెరకెక్కిన నారి, ప్రముఖ సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ మరోసారి హీరోగా వస్తున్న కింగ్ స్టన్, రాక్షస,రా రాజా,పౌరుషం,వైఫ్ ఆఫ్ అనిర్వేష్,శివంగి, నీరుకుళ్ల 35 km ,14 డేస్ లాంటి చిత్రాలు ఈ నెల 7 నే థియేటర్స్ లో సందడి చేయనున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు,విక్టరీ వెంకటేష్ కాంబోలో తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కూడా 7 నే రీరిలీజ్ కాబోతుంది.
ఇక ఓటిటి వేదికగా చూసుకుంటే నెట్ ఫ్లిక్స్ లో
మార్చి 3 న పట్టుదల అనే తెలుగు మూవీ
మార్చి 4 విత్ లవ్ మేఘన్, తెలుగు వెబ్ సిరీస్
మార్చి 7 నాగ చైతన్య, సాయి పల్లవి రీసెంట్ హిట్ మూవీ తండేల్, నదానియన్ 'అనే హిందీ మూవీ సందడి చేయనున్నాయి.
ఈటీవీ విన్ లో చూసుకుంటే
మార్చి 6 'ధూంధాం' తెలుగు మూవీ
అమెజాన్ ప్రైమ్ లో
మార్చి 8 'దపహియ' హిందీ మూవీ
జియో హాట్ స్టార్
మార్చి 4 న డేర్ డెవిల్,హిందీ వెబ్ సిరీస్
మార్చి 7 బాపు తెలుగు మూవీ
సోని లైవ్
మార్చి 7 రేఖ చిత్రం అనే తెలుగు మూవీ
ది వేకింగ్ అఫ్ నేషన్ హిందీ వెబ్ సిరీస్
జీ 5
మార్చి 7 కుటుంబస్థాన్ అనే తమిళ,తెలుగు లాంగ్వేజ్ మూవీ, ఈ విధంగా థియేటర్ తో పాటు ఓటిటి వేదికగా పలు విభిన్నమరపురాని చిత్రాలు సినీ ప్రియులకి కావాల్సినంత వినోదాన్ని అందించడానికి ముస్తాబవుతున్నాయి.
![]() |
![]() |